హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
మురికి కూపంగా మారిన మూసిని లండన్ లోని జేమ్స్ నది కన్నా అద్భుతంగా సుందరీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. నదికి ఇరువైపులా వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకొని 24 గంటల పాటు వ్యాపారం జరిగేలా నది పరివాహక ప్రాంతాల్లో ఐటీ టవర్లు అభివృద్ధిపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాము అని ముఖ్యమంత్రి వివరించారు
#MusiRiverFrontDevelopment #Hyderabad #CM
197 total views, 3 views today