హైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.
మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.
సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్
యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట
పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.
యాదగిరిగుట్టను అన్ని సౌకర్యాలతో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సిఎం కేసిఆర్ గుట్ట అభివృద్ధి పనులను యజ్ఞం లా చేయిస్తున్నారు. యాదగిరిగుట్టను గొప్ప ఆద్యాత్మిక యాత్ర స్థలంగా అభివృద్ధి చేయడానికి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ను (వైటిడిఏ -యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సాధికార సంస్థ) ఏర్పాటు చేసారు. వైటిడిఏ పరిధి లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎలా అభివృద్ధి చేయాలో తెలియజేసే వైటిడిఏ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.
యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి, సైదాపూర్, మల్లాపూర్, దాతార్ పల్లి, బస్వాపూర్ అనే ఏడు గ్రామాలతో 104.58 చ.కి.మీ ల పరిధి తో వైటిడిఏ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పున ఆలేరు, పశ్చిమాన తుర్కపల్లి, ఉత్తరాన రాజాపేట, దక్షిణాన భువనగిరి మండలాలున్నాయి .
యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి కోసం 1391. 09 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఆ భూమిని కింది తెలిపిన విధంగా కేటాయించారు .
1. టెంపుల్ సిటి ఫేజ్ – II – 614.11 ఎకరాలు
2. టెంపుల్ సిటి ఫేజ్ – I – 234.02 ఎకరాలు
3. అటవీ ప్రాంతం – 87.06 ఎకరాలు
4. కొత్తగా భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతం – 132.09 ఎకరాలు
5. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ – 106.31 ఎకరాలు
6. కొత్తగా భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతం – 6.24 ఎకరాలు
7. గండి చెరువు – 34.07 ఎకరాలు
8. కొండ ప్రాంతం – 11.04 ఎకరాలు
9. స్వామీ వారి ఉద్యానవనం – 25 ఎకరాలు
10. కళ్యాణమండపం -25.36 ఎకరాలు 11. వివిఐపి కాటేజీలు – 13.26 ఎకరాలు 12. ఖాళి స్థలం – 20.11 ఎకరాలు
13. అర్చకుల & దేవాలయ ఉద్యోగుల గృహ సముదాయం – 9.22 ఎకరాలు 14. 200 రూములు & డార్మిటరి – 15.15 ఎకరాలు 15. 7000 కార్ పార్కింగ్ – 37.38 ఎకరాలు
16. బస్ టర్మినల్ & షాపింగ్ – 14.27 ఎకరాలు
17. ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ – 1 ఎకర
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా
భవిష్యత్తులో పెరగబోయ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు , సమీప రైల్వే రైల్వే స్టేషన్ ఆధునీకరణ, మెట్రో రైలు సౌకర్యం, పాదచారులకు నడకదారులు, సైకిల్ లాంటి మోటారు యేతర వాహనాలకు ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటుకు ప్రణాలికలు వైటిడిఏ మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు.
రద్దీని ఎదుర్కొనే విశాలమైన రోడ్లు,రింగ్ రోడ్లు
యాదగిరిగుట్టను కలిపే రాయగిరి రోడ్డు , కీసర రోడ్డు, రాజాపేట రోడ్డు,వంగపల్లి రోడ్లను వెడల్పు పెంచి 4 ట్రాకులతో 150 అడుగుల రోడ్లు వేస్తారు.ఈ 4 రోడ్లను కలుపుతూ 150 అడుగుల రింగు రోడ్డును వేస్తారు.
టూరిజం కాన్సెప్ట్ తో కారిడార్లు
యాదగిరిగుట్టలో పంచ నరసింహ స్వామీ, పంచ భూతాలూ జత చేసి ఐదు కారిడార్లు ఏర్పాటు చేసి ఒక్కో కారిడార్ కు పంచ భూతాలలో ఒక పేరు పెట్టి, ప్రతీ కారిడార్ ప్రవేశంలో మహా ద్వారాన్ని నిర్మిస్తారు.
పంచ నరసింహ స్వామి కేత్రం పంచ భూతాలు
యోగనంద నరసింహ అవతారం గాలి
లక్ష్మీ నరసింహ అవతారం నీరు
ఉగ్ర నరసింహ అవతార్ ఆకాశం
గండబేరుండ నరసింహ అవతారం అగ్ని
జ్వాలా నరసింహ అవతారం భూమి
ఐదు కారిడార్ల అభివృద్ధి:
1. జాతీయ రహదారి 169 నుండి దేవస్థానం 2. తుర్కపల్లి నుండి దేవస్థానం ౩.రాజాపేట నుండి దేవస్థానం
4. వంగపల్లి నుండి దేవస్థానం
5. పాతగుట్ట నుండి దేవస్థానం
ఎక్కువ రద్దీ ఉండే మొదటి రెండు కారిడార్లు అయిన జాతీయ రహదారి 169 నుండి దేవస్థానం వచ్చే కారిడార్, తుర్కపల్లి నుండి దేవస్థానం వచ్చే కారిడార్ లలో పాదచారులకు నడకదారులు, సైకిల్ లాంటి మోటారు యేతర వాహనాలకు ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటు చేస్తారు.
యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ రూపు రేఖలు సమూలంగా మార్చుతున్నారు. దేవాలయం చుట్టూ గిరిప్రదక్షిణకు అనువుగా రోడ్ల నిర్మాణం, యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రోడ్లను 150 ఫీట్లతో 6 వరుసల రోడ్లుగా మార్చడం, ప్రధాన రోడ్లను కలిపే రింగు రోడ్డు, యాత్రికులకు కావలసిన వసతి సౌకర్యాల కల్పన, చెరువులను, అడవులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం వంటి అభివృద్ధి పనులతోపాటు యాదగిరిగుట్టను తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రంగా , యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి ఏకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి , ప్రధాన నగరంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఇదంతా గుట్టను అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రక్రియ అయితే దీనిని ఆధారంగా చేసుకొని మరో నగరం యాదగిరిగుట్టకు 6 కి మీ ల దూరంలో మాసాయిపేటలో అన్ని హంగులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఈ నగరం కూడా ఏర్పాటైతే యాదగిరిగుట్ట జంట నగరాలుగా రూపుదిద్దుకుంటుంది. ఈ కొత్త నగరమే “సిద్ధ క్షేత్ర ధాం”.
సిద్ధ క్షేత్ర ధాం ను శ్రీ అభ్యసేన్ సురేశ్వర్ జీ మహారాజ్ గారి ఆద్వర్యంలో సహయోగ ట్రస్ట్ వారు 1000 ఎకరాలలో నిర్మించడానికి ప్రణాలికలు రూపొందించారు. ఇందులో భాగంగా 125 ఎకరాలలో 3185 కోట్లతో మొదటి దశలో విద్యాలయాలు, కళాశాలలు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు, త్రీ డి ఐ మాక్స్ థియేటర్, క్రికెట్ స్టేడియం, ఇతర ఆట స్థలాలు,గోశాల మరియు నివాస గృహాలతో టౌన్షిప్ కూడా అభివృద్ధి చేయనున్నారు.
సిద్ధ క్షేత్ర ధాం వల్ల మాసాయిపేట శివారు లో ఉన్న వెంచర్లకు గిరాకి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ వెంచర్లు వెలిసాయి. భవిష్యత్తులో కాబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్నారు.
ప్రభుత్వ నిబందనల ప్రకారం ఇక్కడ డిటిసిపి అప్రూవల్ ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనాలి. డిటిసిపి అప్రూవల్ ఉన్నప్లాట్లు కొనడం వల్ల న్యాయ పరమైన మరియు సాంకేతిక పరమైన సమస్యలు ఉండవు.