ఐటీ రంగంలో అనేక స్టార్టప్ లకు కేంద్రంగా భాసిల్లుతున్న టీ-హబ్ తరహాలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ రంగంలో ప్రతిష్టాత్మకంగా టీ-వర్క్స్ ఏర్పాటు చేస్తున్నది. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ రంగంలో ఒక కొత్త ఆలోచన వచ్చిన వారికి ఉత్పత్తిని అభివృద్ధి చేసుకుని వెళ్ళ గలిగేలా దీన్ని తీర్చిదిద్దుతుంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒకేచోట ఉండేలా ఐటీ కారిడార్లో దీనిని నిర్మిస్తున్నారు. ఐటీ రంగానికి చిరునామా మారిన తెలంగాణ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ ఉత్పత్తుల రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఎలక్ట్రానిక్ & హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు టీ వర్క్స్ పేరుతో దేశంలోని అతిపెద్ద ప్రో టైపింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నది. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న టీ వర్క్స్ లో 250 రకాల పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునిక మౌలిక వసతులను వివిధరకాల ఉపకరణాలను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో త్రీ డీ ప్రింటర్, లేజర్ కట్టర్, PCB ఫ్యాబ్రికేషన్ వ్యవస్థలు, యంత్రాల నిర్వహణకు ఉపయోగించే CNC మిషన్ పలు రకాల ఇతర ఉపకరణాలు ఉంటాయి. ఉత్పత్తి నమూనాల అభివృద్ధి కి కావలసిన అన్ని రకాల సదుపాయాలు టి వర్క్ లో ఉంటాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈలు), స్టార్టప్ లు, ఆవిష్కర్తలు తమ ఆలోచనల కు రూపం ఇచ్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఉత్సాహం ఉన్నవారు నేరుగా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో టీ వర్క్స్ కు శ్రీకారం చుట్టారు. ఐటీ కారిడార్లో దాదాపు 44 కోట్లతో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ భవన నిర్మాణం పనులు 90% పూర్తయ్యాయి. ఇక మిగిలింది వీటిని కూడా త్వరగా పూర్తిచేసి ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీ వర్క్స్ లోకి రావాలి అనుకుంటున్నా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.
ప్రధాన ఉద్దేశ్యాలు : ఎలక్ట్రానిక్ & హార్డ్వేర్ రంగంలో వినూత్న రూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం. పెట్టుబడిదారులు సలహాదారులు మార్గదర్శకుల ను ఆకర్షించడం. రంగం అభివృద్ధికి పరిశ్రమలు విద్యాసంస్థలు ప్రభుత్వ శాఖలు ఏకమై పని చేసే వీలు కల్పించాలనే ద్యేయంతో రాష్ట్ర ఐటీ శాఖ టీ వర్క్స్ ఏర్పాటు చేస్తున్నది. ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా ఇది పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం, హార్డ్వేర్ తయారీ అత్యాధునిక సదుపాయాలు కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో స్టార్టప్ లను ప్రోత్సహించడం, ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నిపుణులైన మానవ వనరులను అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశ్యాలు. రాష్ట్రంలోని ఎం ఎస్ ఎం స్టార్టప్ లు సృజనాత్మక ఆవిష్కర్తలకు టీ వర్క్స్ ఎంతో ఉపయోగం ఎంతో ఉపయోగపడుతుంది.
7,152 total views, no views today