హైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద పెరిగింది. డజనుకు పైగా ప్రముఖ అంతర్జాతీయ ఐటి కంపనీలు ఐటి స్థావరంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్ లో అడ్డా వేస్తున్నాయి. ఇలా వచ్చిన కంపనీలలో కొన్ని భారత్ లో మొదటి కార్యలయలున్నాయి. భారత్ లో అడుగుపెట్టాలనుకున్న ఐటి కంపనీలు ఇలా హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్ టెక్నాలజీ, ఎఫ్5 నెట్‌వర్క్స్, మ్యాథ్‌వర్క్స్, క్లీన్ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్ టెక్నాలజీస్, త్రైవ్ డిజిటల్, బాంబార్డియర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైనాకు థందర్ సాఫ్ట్ వేర్ టెక్ గత వారంలో ప్రారంభించబడింది. ఇంకా చాలా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించటానికి సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఐటి కంపనీలకు అనువైన వాతావరణం, మౌలికసదుపాయాలు కల్పన, సాంకేతిక నిపుణుల లభ్యత పుష్కలంగా హైదరాబాద్ లో ఉండడం వల్ల కంపనీలు క్యూ కడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడం వల్ల కంపనీలు వరదలా వచ్చిపడుతున్నాయి.
ఇలా కంపనీలు రావడం వల్ల ఉద్యోగఅవకాశాలు పెరగడమే కాకుండా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లకు గిరాకి పెరుగుతుంది.
ఇదివరకు ఏదైనా కంపనీ భారత్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటే బెంగలూరు లో కార్యాలయాలను ఏర్పాటుచేసుకునేది. ఇప్పుడు రూటు మార్చి హైదరాబాద్ లో ఆఫీసులను పెడుతున్నాయి.
* హైదరాబాద్ లో ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ
*నగరంలో నూతన ఐటీ క్లస్టర్లకు అనుగుణంగా వసతుల కల్పన
*స్వల్పకాలిక లక్ష్యాలతో కార్యాచరణ
*అవసరమైన చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైటెక్ సిటి, గచ్చిబౌలి లు ఐటీ కంపనీలకు అడ్డలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపనీలను నగరం నలుదిశలా విస్తరించి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయసగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న మంత్రి కేటీఆర్, త్వరలోనే ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, హెచ్‌ఎండీఏ తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లివంటి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతోపాటుగా నూతనంగా ఏర్పాటుకానున్న మరో ఐటీ క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురుగునీటి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటిసరఫరా అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఐటీ రంగంలో ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి . రానున్న ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకేవైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పెరుగుదలలో భాగంగా అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, అవకాశం ఉన్న చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటివి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఐ టి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి హబ్ ను ప్రారంభించాలని ఐటి మంత్రి నిర్ణయించారు. ఒక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మాధాపూర్, కొండాపూర్, గోపన్నపల్లి లతో శేరిలింగంపల్లి ఐ టి హబ్ లాగ రాజేంద్రనగర్ కూడా రాబోయే రోజుల్లో ఐ టి కంపనీలతో కళకళ లాడుతుంది అన్నారు.
బుద్వేలు, కిస్మత్ పూర్ మధ్యలో 350 ఎకరాల భూమిని ఐ టి క్లస్టర్ కోసం గుర్తించామని తెలిపారు. ఇటీవల 28 ఐ టి కంపనీల అధికారులు ఐ టి క్లస్టర్ కోసం కేటాయించిన స్థలాన్నీ సందర్శించి కంపనీలను ఏర్పాటుచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ ఐటి కంపనీల ద్వార 1.2 లక్షల మందికి ఉపాది కలుగుతుందని, దీనిని నేనే స్వయంగా సమీక్షిస్తూ రాజేంద్రనగర్ ను అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్, బెంగలూరుల మధ్య వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
వికారాబాద్ నుండి 42 కి మీ మేర మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల ఖర్చుతో ఆగస్ట్ లో పని ప్రారంభిస్తామని చెప్పారు. మరో 100 కోట్లతో గండిపేట సుందరీకరణ చేసి సిటి నుండి కుటుంబంతో సహా వచ్చి గడిపే విదంగా మాల్స్ , సినిమా హల్లకు అనుమతినిచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటిఆర్ చెప్పారు.