హైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.
మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.
మెదక్ జిల్లా(2) : తూప్రాన్, నర్సాపూర్
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా (13) : జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తుమ్కుంట, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, కోంపల్లి, బౌరంపేట్, దుండిగల్.
రంగారెడ్డి జిల్లా(8): శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగిర్, ఆదిబట్ల, శంకర్పల్లి, తుక్కుగూడ
సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్
యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట
పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.
5,287 total views, no views today