జీవో 69 లోని అంశాలు
అప్పట్లో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వాటి పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 111 జీవో ద్వారా ఆంక్షలు విధించారు.
జీవో జారీ చేసినప్పుడు రిజర్వాయర్ల నుంచి నగరానికి పొందిన నీరు 27.59 పర్సెంట్ వరకు ఉండేది. ప్రస్తుతం సరఫరా అయ్యేది 1.25%.
ఇప్పుడు నగర ప్రజలు తాగునీటి కోసం ఈ రిజర్వాయర్ లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. 111 జీవో ఆంక్షలను తొలగిస్తున్నాము.
రిజర్వాయర్ల పరిరక్షణ అభివృద్ధికి చేపట్టే చర్యలు
- జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ప్రత్యేక పైపులైన్లు మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP)ఏర్పాటు
- నీటి నాణ్యత మెరుగుపడేలా శుద్ధి చేసిన ఏర్పాట్లు
- వ్యవసాయ క్రిమిసంహారకాలు చేరకుండా చర్యలు
- రిజర్వాయర్ల చుట్టూ గ్రీన్ జోన్ వృద్ధి చేయడం.
- లే అవుట్లు భవన నిర్మాణాలు అనుమతులపై ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ
- న్యాయపరమైన చిక్కులు కాకుండా పటిష్టమైన చర్యలు
- 111 జీవో పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
49,506 total views, 345 views today