కొత్వాల్ గూడలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్

  • 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్
  • బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్ ల ఏర్పాటు
సింగపూర్ లోని నైట్ సఫారీ పార్క్

నగరానికి దూరంగా ఎక్కడో అడవిలో  ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా ?  చీకట్లో సైతం ఎటువంటి అపాయం లేకుండా వన్య ప్రాణుల  మధ్య సంచరించాలనుకుంటున్నారా  ?  అయితే మీ కోరిక హైదరాబాద్ లోనే  నెరవేరబోతుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో  కొత్వాల్ గూడలో 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి హెచ్ ఎం డి ఏ సన్నాహాలు చేస్తుంది.

హైదరాబాద్ లో

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కొత్వాల్ గూడను నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి తగిన స్థలంగా  గుర్తించారు. 80 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇంకా 45 ఎకరాల స్థలం సేకరించవలసి ఉంది. ఈ నైట్ సఫారి పార్క్ కొత్త  అనుభూతులను  అందిస్తుంది అనడం లో  ఎలాంటి సందేహం లేదు. ఇది భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తుందని హెచ్ఎండిఏ కమీషనర్ చిరంజీవులు అన్నారు.

సింగపూర్ లో నైట్ సఫారి పార్క్ ఎలా ఉంటుందో కింది విడియోలో చూడవచ్చు

 

7,732 total views, no views today