అమీర్ పేట – ఎల్ బి నగర్ మెట్రో రైలుమార్గం ప్రారంభం

HyderabadUpades.in, metro rail updates, hyderabad updates, metro carridor 1 openingహైదరాబాద్‌లో నగరవాసులకు ట్రాఫిక్ నుండి కాస్త ఊరట లభించినట్లే. అమీర్‌పేట, ఎల్బీ నగర్ మధ్య ప్రయాణించే వారికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెట్రో కల నిజమయింది. అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు  ప్రయాణం ప్రారంభం అయింది. గవర్నర్ నరసింహన్ అమీర్ పేట మెట్రో స్టేషన్లో జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ తదితరులు అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు  ప్రయానించారు.

ఎల్బీనగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని, తద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని, వీటి నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad, ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్‌ వసతులు అందుబాటులో లేవు. మెట్రో స్టేషన్ పార్కింగ్‌ వసతి లేని చోట స్టేషన్ కు కొద్ది దూరంలో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడమైనది.

ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్‌ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలో మీటర్ల  మియాపూర్ కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

హైదరాబాద్ మెట్రో కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మొత్తం 27 కిలోమీటర్లు. ఇందులో మియాపూర్ నుండి అమీర్‌పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. ఇంకా కారిడార్ ౩ నాగోల్ నుండి రాయదర్గ వరకు మొత్తం 29  కిలోమీటర్లు ఇందులో నాగోల్ నుండి అమీర్ పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు.   రెండో దశగా కారిడార్ 1లో అమీర్ పేట నుండి ఎల్బీనగర్ వరకు ఇప్పుడు ప్రారంభించారు. మొత్తానికి కారిడార్ 1 మొత్తం పూర్తయింది. కారిడార్ ౩ లో అమీర్‌పేట నుండి హైటెక్ సిటి వరకు ఈ ఏడాది నవంబర్ లో పూర్తీ కావచ్చని అధికారులు చెపుతున్నారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots  at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

7,242 total views, no views today

హెచ్ఎండిఏ(HMDA) పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు

HyderabadUpdates.in, hyderabad updates, hmda map oulineహైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి.  హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.

మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో  13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8  మున్సిపాలిటీలు,  సంగారెడ్డి జిల్లాలో 3  మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.

 

మెదక్ జిల్లా(2) :  తూప్రాన్, నర్సాపూర్

మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా (13) : జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం,  పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తుమ్‌కుంట, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, కోంపల్లి, బౌరంపేట్, దుండిగల్.

రంగారెడ్డి జిల్లా(8): శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగిర్, ఆదిబట్ల, శంకర్‌పల్లి, తుక్కుగూడ

సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్

యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట

పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.

5,197 total views, no views today

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అడ్డా గా మారింది

తెలంగాణ రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ కు సాక్ష్యంగా నిలిచింది.దేశంలోని మిగత నగరాలలో రియల్ ఎస్టేట్ వెనకడుగులో ఉన్నప్పుడు మంచి రాబడులను ఇచ్చిన ఏకైక నగరం హైదరాబాద్.

అనరాక్ కన్సల్టెన్సీ వారి పరిశోదన ప్రకారం, భారత దేశంలోని ఏడు అతి పెద్ద నగరాలలో హైదరాబాద్ మాత్రమే 2013-14 నుండి 2017 వరకు 34% వృద్ధి సాధించింది. ధిల్లీ, ముంబై, పూణే, చెన్నై, కోల్ కతా లలో అమ్మకాలు పడిపోయాయి.  ధిల్లీ NCR లో అత్యధికంగా 67% తగ్గాయి. బెంగళూరులో 21% తగ్గాయి.

Image Source: Economic Times.

8,406 total views, 3 views today

హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు

Hyderabad Updates, CM, KCR, UAE Minster, IT Minister, KTR
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం

హైదరాబాద్ నగరంలో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నది .

గురువారం ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో  హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, యుఎఇల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి, యుఎఇ మంత్రికి చెప్పారు. దీనికి యుఎఇ  విదేశీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ కాన్సులేట్ ఏర్పాటుకు అంగీకరించినట్టు అధికారులకు సూచనలు ఇచ్చారు.

వివిధ దేశాల నుంచి ప్రజలు వైద్య చికిత్స కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ వైద్య పర్యటనకు  గమ్యస్థానంగా ఉందని యుఎఇ మంత్రికి కేసీఆర్ వివరించారు.
తెలంగాణాలో ‘వ్యాపారం చేయడం సులభం’ గురించి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  వివరించారు. “దేశం యొక్క తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది” అని ఆయనకు తెలిపాడు.

7,487 total views, no views today

హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి క్లస్టర్

hyderabad updates, hitec city hyderabad, rajendranagar, serilingampalli
హైటెక్ సిటి హైదరాబాద్ (పాత చిత్రం)

ఐ టి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి హబ్ ను ప్రారంభించాలని ఐటి మంత్రి నిర్ణయించారు. ఒక సమావేశంలో కేటీఆర్  మాట్లాడుతూ  మాధాపూర్, కొండాపూర్, గోపన్నపల్లి లతో  శేరిలింగంపల్లి ఐ టి హబ్ లాగ రాజేంద్రనగర్ కూడా రాబోయే రోజుల్లో ఐ టి కంపనీలతో కళకళ లాడుతుంది అన్నారు.

బుద్వేలు, కిస్మత్ పూర్ మధ్యలో 350 ఎకరాల భూమిని ఐ టి క్లస్టర్ కోసం గుర్తించామని తెలిపారు.  ఇటీవల 28  ఐ టి కంపనీల అధికారులు ఐ టి క్లస్టర్ కోసం కేటాయించిన స్థలాన్నీ సందర్శించి కంపనీలను ఏర్పాటుచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ  ఐటి కంపనీల ద్వార 1.2 లక్షల మందికి ఉపాది కలుగుతుందని, దీనిని నేనే స్వయంగా సమీక్షిస్తూ రాజేంద్రనగర్ ను అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి స్పష్టం చేశారు.

శంషాబాద్, బెంగలూరుల మధ్య వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

వికారాబాద్ నుండి 42 కి మీ మేర మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల ఖర్చుతో ఆగస్ట్ లో పని ప్రారంభిస్తామని చెప్పారు. మరో 100 కోట్లతో గండిపేట సుందరీకరణ చేసి సిటి నుండి కుటుంబంతో సహా వచ్చి గడిపే విదంగా మాల్స్ , సినిమా హల్లకు అనుమతినిచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటిఆర్  చెప్పారు.

8,422 total views, no views today