యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ రూపు రేఖలు సమూలంగా మార్చుతున్నారు. దేవాలయం చుట్టూ గిరిప్రదక్షిణకు అనువుగా రోడ్ల నిర్మాణం, యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రోడ్లను 150 ఫీట్లతో 6 వరుసల రోడ్లుగా మార్చడం, ప్రధాన రోడ్లను కలిపే రింగు రోడ్డు, యాత్రికులకు కావలసిన వసతి సౌకర్యాల కల్పన, చెరువులను, అడవులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం వంటి అభివృద్ధి పనులతోపాటు యాదగిరిగుట్టను తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రంగా , యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి ఏకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి , ప్రధాన నగరంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఇదంతా గుట్టను అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రక్రియ అయితే దీనిని ఆధారంగా చేసుకొని మరో నగరం యాదగిరిగుట్టకు 6 కి మీ ల దూరంలో మాసాయిపేటలో అన్ని హంగులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఈ నగరం కూడా ఏర్పాటైతే యాదగిరిగుట్ట జంట నగరాలుగా రూపుదిద్దుకుంటుంది. ఈ కొత్త నగరమే “సిద్ధ క్షేత్ర ధాం”.
సిద్ధ క్షేత్ర ధాం ను శ్రీ అభ్యసేన్ సురేశ్వర్ జీ మహారాజ్ గారి ఆద్వర్యంలో సహయోగ ట్రస్ట్ వారు 1000 ఎకరాలలో నిర్మించడానికి ప్రణాలికలు రూపొందించారు. ఇందులో భాగంగా 125 ఎకరాలలో 3185 కోట్లతో మొదటి దశలో విద్యాలయాలు, కళాశాలలు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు, త్రీ డి ఐ మాక్స్ థియేటర్, క్రికెట్ స్టేడియం, ఇతర ఆట స్థలాలు,గోశాల మరియు నివాస గృహాలతో టౌన్షిప్ కూడా అభివృద్ధి చేయనున్నారు.
సిద్ధ క్షేత్ర ధాం వల్ల మాసాయిపేట శివారు లో ఉన్న వెంచర్లకు గిరాకి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ వెంచర్లు వెలిసాయి. భవిష్యత్తులో కాబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్నారు.
ప్రభుత్వ నిబందనల ప్రకారం ఇక్కడ డిటిసిపి అప్రూవల్ ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనాలి. డిటిసిపి అప్రూవల్ ఉన్నప్లాట్లు కొనడం వల్ల న్యాయ పరమైన మరియు సాంకేతిక పరమైన సమస్యలు ఉండవు.
8,061 total views, 12 views today