హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి క్లస్టర్

hyderabad updates, hitec city hyderabad, rajendranagar, serilingampalli
హైటెక్ సిటి హైదరాబాద్ (పాత చిత్రం)

ఐ టి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి హబ్ ను ప్రారంభించాలని ఐటి మంత్రి నిర్ణయించారు. ఒక సమావేశంలో కేటీఆర్  మాట్లాడుతూ  మాధాపూర్, కొండాపూర్, గోపన్నపల్లి లతో  శేరిలింగంపల్లి ఐ టి హబ్ లాగ రాజేంద్రనగర్ కూడా రాబోయే రోజుల్లో ఐ టి కంపనీలతో కళకళ లాడుతుంది అన్నారు.

బుద్వేలు, కిస్మత్ పూర్ మధ్యలో 350 ఎకరాల భూమిని ఐ టి క్లస్టర్ కోసం గుర్తించామని తెలిపారు.  ఇటీవల 28  ఐ టి కంపనీల అధికారులు ఐ టి క్లస్టర్ కోసం కేటాయించిన స్థలాన్నీ సందర్శించి కంపనీలను ఏర్పాటుచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ  ఐటి కంపనీల ద్వార 1.2 లక్షల మందికి ఉపాది కలుగుతుందని, దీనిని నేనే స్వయంగా సమీక్షిస్తూ రాజేంద్రనగర్ ను అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి స్పష్టం చేశారు.

శంషాబాద్, బెంగలూరుల మధ్య వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

వికారాబాద్ నుండి 42 కి మీ మేర మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల ఖర్చుతో ఆగస్ట్ లో పని ప్రారంభిస్తామని చెప్పారు. మరో 100 కోట్లతో గండిపేట సుందరీకరణ చేసి సిటి నుండి కుటుంబంతో సహా వచ్చి గడిపే విదంగా మాల్స్ , సినిమా హల్లకు అనుమతినిచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటిఆర్  చెప్పారు.

7,759 total views, 3 views today

One thought on “హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి క్లస్టర్”

Comments are closed.