హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం

*హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం*తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం (Arcesium) హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది.ఆర్సీజియం (Arcesium) సీఈఓ గౌరవ్ సూరి గారు, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఆర్సీజియం (Arcesium) అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి పరుస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు.వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్ (DE Shaw group), బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ Blackstone Alternative Asset Management (BAAM) మద్దతుతో ఆర్సీజియం (Arcesium) స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది.ఆర్సీజియం (Arcesium) తన సేవలను విస్తరణ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

101 total views, no views today

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్

*హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్**-ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ*ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్ లో ట్రైజిన్ (Trigyn) కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. Trigyn కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు Trigyn కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.

134 total views, no views today

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల (రూ.839 కోట్ల) పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడుపోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

93 total views, no views today

హైదరాబాద్ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ ఏడాదిలోపు అందుబాటులోకి

రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ మరో ఏడాదిలోపు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్రెడాయి హైదరాబాద్ ఆధ్వర్యంలో “రీ-ఇమాజినింగ్ హైదరాబాద్” కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

భవిష్యత్ తరాలనూ దృష్టిలో ఉంచుకొని, రేపటి అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. నాలుగో మహా నగర నిర్మాణంలో భాగంగా ఆ ప్రణాళికల్లో కొన్ని పనులను కూడా చేపట్టామని తెలిపారు.

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బ్యాగరికంచె ప్రాంతం రాబోయే రోజుల్లో సంపదలో బంజారాహిల్స్‌ను మించిపోతుందని చెప్పారు.

పాలకులుగా ఎవరున్నా ఈ చారిత్రక నగర అభివృద్ధికి తీసుకున్న విధానాలు కొనసాగాయి కాబట్టే హైదరాబాద్ నగరానికి ప్రపంచం స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందన్నారు.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌తో కలుషితం లేని నీటి ప్రవాహాన్ని చూడబోతున్నామని, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగి నగరం చుట్టుపక్కల్లో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.

కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, క్రెడాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

152 total views, no views today

హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ కోసం ప్రత్యేక ప్రణాళిక

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇన్ ముల్ నర్వ లో 95.25 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధి చేసి, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఔట్లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు.

హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూముల్లో దాదాపు సాగులో లేనివే. అవి అసైన్డ్ కేటగిరీలో ఉండటంతో రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది. రైతు భూ యజమానిగా, హెచ్ఎండిఏ డెవలపర్ గా ఉంటుంది. ఇందులో రైతులకు 60 శాతం బదిలీ చేస్తుంది. మిగతా 40 శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి పరిధిలో దాదాపు 924.28 ఎకరాలు అధికారులు పరిశీలించారు.

ఆదాయం పెంపు దిశగా అడుగులు

హెచ్ఎండిఏ పై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ. 500 కోట్ల వరకు మౌలిక వసతులకు కేటాయించింది. అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో 355, బోగారంలో 125, ప్రతాప్సింగారంలో 152, నాదర్గుల్ లో 91 ఎకరాల్లో లేఅవుట్లు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

120 total views, no views today

మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తీ 

  • ఎల్ఆర్ఎస్  ప్రక్రియకు మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం 
  • ఈ వారం నుంచి దరఖాస్తుల పరిశీలన  ప్రారంభం 
  • ప్లాట్లకు మూడు దశల్లో, లేఔట్లకు నాలుగు దశల్లో పరిశీలన 

రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనలో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. 

25 లక్షల దరఖాస్తులు 

స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020లో  సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు కోర్ట్ లో కేసులు ఉండడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు.  ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటామంటూ  అఫిడవిట్ తీసుకొని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటినుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల జారీ తో దరఖాస్తుదారులను హర్షం వ్యక్తం అవుతుంది.  

ముందుగా  సిజిజి పరిశీలన 

ఆ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుగా  పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోస్తుంది. ఆయా  ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది.  దరఖాస్తుదారులు అవసరమైన పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది. 

సి జి జి వడపోత తరువాత మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాళాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సిజిజి రూపొందించిన సెల్ ఫోన్ యాప్ లలో నమోదు చేస్తారు

 రెండో దశలో 

మరింత అధ్యయనం చేసి అర్హమైన నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు. 

మూడో దశలో 

అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేస్తారు. 

లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు 

సహాయ కేంద్రాల ఏర్పాటు 

క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలు భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో స్టేటస్ చెక్ చేసుకోవడానికి https://lrs.telangana.gov.in/layouts/CitizenLogin.aspx

120 total views, no views today

కోకాపేట్ నియోపోలిస్ వరకు మెట్రో రైలు విస్తరణ

hyderabad-metro-rail-station, metro rail, 1 st phase Hyderabad metro rail, Miyapur to Nagole metro rail,
hyderabad-metro-rail-station

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణతో నగరం మరింత అభివృద్ధి చెందుతోంది. శివార్లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రాథమిక మౌలిక సదుపాయాలతో, నగరం మరింత విస్తరించడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మెట్రో రెండో దశలో దూరం మరియు అంచనా వ్యయాన్ని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. గతంలో ఐదు కారిడార్లలో 70 కిలోమీటర్లు కవర్ చేయగా, ఇప్పుడు అది 8.4 కిలోమీటర్లు పెరిగి మొత్తం 78.4 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో మొత్తం మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు చేరింది.

హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి విప్రో సర్కిల్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్ కాన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదనలో చేర్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును కోకాపేటలోని నియోపోలిస్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ పొడిగింపు మెట్రో మార్గానికి సుమారు 3.3 కిలోమీటర్లు జోడిస్తుంది. అదనంగా, మెట్రో రైలు డిపో నిర్మాణానికి ప్రభుత్వం కోకాపేటలో భూమిని సర్వే చేస్తోంది.

మరో రూట్‌లో నాగోల్, ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట, మల్కాజిగిరి సర్కిల్ నుంచి జాలపల్లి మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర ఎయిర్‌పోర్ట్ మెట్రోను ప్రాథమికంగా అంచనా వేశారు. మల్కాజ్‌గిరి నుంచి ఆరామ్‌ఘర్‌, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్ల పొడిగింపును బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట కారిడార్లలో ఎలాంటి మార్పులు లేవని బడ్జెట్‌లో స్పష్టం చేశారు.

మెట్రో రైలు ప్రాజెక్టు కోకాపేట వరకు విస్తరించడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటంతో కోకాపేట మరియు దాని పరిసర ప్రాంతాలు ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మెట్రో రైలుతో శంకరపల్లి, చేవెళ్ల వరకు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దూరం కాస్త ఎక్కువైనా, అద్భుతమైన రవాణా సౌకర్యాలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఆసక్తిని కలిగిస్తాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

146 total views, no views today

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ₹10వేల కోట్లు

మూసి సుందరీకరణ మరియు హైడ్రాకు నిధుల కేటాయింపు

hyderabad updates, hitec city hyderabad, rajendranagar, serilingampalli
హైటెక్ సిటి హైదరాబాద్ (పాత చిత్రం)

జిహెచ్ఎంసీ కి 3065 కోట్లు, జలమండలికి 3385 కోట్లు, మూసి సుందరీకరణ 1500 కోట్లు, ఎం ఎం టి ఎస్ 50 కోట్లు, హెచ్ ఎం డి ఏ 500 కోట్లు, హైడ్రా 200 కోట్లు, ఎయిర్ పోర్ట్ మెట్రో 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో 500 కోట్లు, ఓఆర్ఆర్ 200 కోట్లు నిధుల కేటాయింపు

మెట్రో రైలు విస్తరణ కోసం సమగ్ర ప్రణాళిక

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత మెట్రో రైలు విస్తరణ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మరియు సుస్థిర పట్టణ అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా ఉంది. ప్రస్తుత మెట్రో మార్గాలను పాత నగరం మరియు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిపేలా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుల కొరకు కేటాయింపు:

పాత నగరం మెట్రో విస్తరణ: రూ 500 కోట్లు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్: రూ 500 కోట్లు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విస్తరణ: రూ 100 కోట్లు

ఇతర రవాణా మార్గాలతో సమర్థవంతమైన అనుసంధానం, ప్రయాణికుల సౌలభ్యం మరియు సమర్థవంతమైన ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం అధునాతన సాంకేతికతల స్వీకరణపై దృష్టి పెట్టనున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్ట్ కోసం నిధుల కేటాయింపు

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్ట్ నగర కేంద్రాన్ని రద్దీ చేయకుండా చేసేందుకు మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ 1,525 కోట్లు కేటాయించింది. ఆర్‌ఆర్‌ఆర్ నగర చుట్టూ ట్రాఫిక్ ప్రవాహం సాఫీగా ఉండేలా చేయడం, ప్రధాన రహదారులను అనుసంధానం చేయడం మరియు పర్యవసాన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడం. ఈ ప్రాజెక్ట్ సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఉండేందుకు సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు మరియు అండర్‌పాస్లు వంటి సహాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా కలిగి ఉంటుంది.

మూసి నది శుభ్రత మరియు సుందరీకరణ కోసం సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)

మూసి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒక ప్రాముఖ్యత కలిగిన పర్యావరణ మరియు పట్టణ అభివృద్ధి కార్యక్రమం, దీని బడ్జెట్ కేటాయింపు రూ 1,500 కోట్లు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) క్రింది భాగాలను కలిగి ఉంటుంది:

నది శుభ్రత: కాలుష్యాలను తొలగించి నది యొక్క పర్యావరణ సంతులనం పునరుద్ధరించడానికి అధునాతన నీటి శుద్ధి సాంకేతికతలను అమలు చేయడం.

సుందరీకరణ: నది తీరం పక్కన పార్కులు, ప్రొమెనేడ్‌లు మరియు వినోద ప్రాంతాల అభివృద్ధి చేయడం ద్వారా అందాన్ని మెరుగుపరచడం మరియు ప్రజలకు బహిరంగ ప్రదేశాలను అందించడం.

తెలంగాణ ప్రభుత్వం నగర చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించే ప్రణాళికలను ప్రకటించింది, ఇవి ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా, ఈ టౌన్‌షిప్‌లలో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తక్కువ ధరలో నివాస గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెట్రో రైలును పొడిగించి, నగరంలోని వివిధ వర్గాల అవసరాలను పరిష్కరించడం ద్వారా, నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం 24,042 కోట్ల అంచనా వ్యయంతో 78.4 కిలోమీటర్ల మేర ఐదు అదనపు మెట్రో కారిడార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, ఓల్డ్ సిటీ వరకు మెట్రో రైలును పొడిగించి, శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేయనున్నారు.

కాగా, నాగోల్, ఎల్బీనగర్ నుంచి మెట్రోను పొడిగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్లను ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేయనున్నారు. ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు, మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో రైలు సౌకర్యాలను పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేస్తోంది. అదనంగా, హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలను కోర్ అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును హైదరాబాద్‌ మెట్రో సిటీకి సరిహద్దుగా పరిగణించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విపత్తు నిర్వహణ కోసం ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయడంతోపాటు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలను దాని పరిధిలోకి చేర్చేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఈ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటుంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, నదీతీరంలో కొత్త వాణిజ్య మరియు నివాస కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు పాత వారసత్వ ప్రాంతాల శోభను పెంపొందించడం కోసం కృషి చేస్తోంది.

లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీ నది మరియు దాని పరిసర ప్రాంతాలను పునరుజ్జీవింపజేయడం, అభివృద్ధి చేయడం మరియు సుందరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం, ప్రభుత్వం మొదటి దశకు రూ.1,500 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌లో రిక్రియేషనల్ జోన్‌లు, పాదచారుల జోన్‌లు, పిల్లల థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు మరియు పీపుల్స్ ప్లాజాల అభివృద్ధి ఉంటాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కోసం రూ.3,065 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.500 కోట్లు మరియు మెట్రో వాటర్ పనులకు రూ.3,385 కోట్లు కేటాయించారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్‌ విస్తరణకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో పొడిగింపుకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు రవాణా వ్యవస్థకు రూ.50 కోట్లు కేటాయించారు.

ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు 158.6 కిలోమీటర్ల రహదారిని మరియు దక్షిణ ప్రాంతంలోని చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్, సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారి హోదాగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)ను ప్రారంభంలో నాలుగు లేన్లతో నిర్మించి, తర్వాత ఎనిమిది లేన్లుగా విస్తరించాలని యోచిస్తోంది.

ముందస్తు అంచనాల ప్రకారం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు మరియు దక్షిణాది అభివృద్ధికి దాదాపు రూ.12,980 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ కోసం రూ.1,525 కోట్లు కేటాయించారు. చారిత్రాత్మకంగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరాన్ని పద్దతిగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

114 total views, no views today

విల్లా ప్రాజెక్టుల పేరుతో రూ. 15 కోట్ల మోసం

భవిష్య రియాల్టర్స్ మరియు NSA అవెన్యూ అనే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి మహేశ్వరంలో 17 ఎకరాల స్థలంలో విల్లా ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. ఆసక్తి ఉన్నవారు అడ్వాన్సులు చెల్లించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అందరూ వారు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలు చూపాలని కోరగా ధరణి వెబ్సైట్ తెరుచుకోవడం లేదని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తప్పించుకున్నారు.

గత నెలలోడబ్బులు చెల్లించిన కొనుగోలుదారులు ఆ స్థలాన్ని సందర్శించగా ఆ స్థలం బిల్డర్లది కాదని తేలింది. దీంతో బిల్డర్లు మోసం చేశారని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.

#Hyderabad #Prelaunchscam #hyderabadrealestate

221 total views, no views today

మూసి పరివాహకం లో వ్యాపార కేంద్రాలు, ఐటీ టవర్లు

హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

మురికి కూపంగా మారిన మూసిని లండన్ లోని జేమ్స్ నది కన్నా అద్భుతంగా సుందరీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. నదికి ఇరువైపులా వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకొని 24 గంటల పాటు వ్యాపారం జరిగేలా నది పరివాహక ప్రాంతాల్లో ఐటీ టవర్లు అభివృద్ధిపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాము అని ముఖ్యమంత్రి వివరించారు

#MusiRiverFrontDevelopment #Hyderabad #CM

143 total views, no views today