హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో బ్రూక్ ఫీల్డ్ 100 మిలియన్ డాలర్ల నిర్మాణాత్మక పెట్టుబడి

HyderabadUpdates.in,Hyderabad Updates, Apartments, gated communitiesకెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ అస్సేట్ మేనేజ్మెంట్ కంపెని 100 మిలియన్ డాలర్లను  ఇంకర్ అనే హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టింది.

దేశంలో  పెద్ద పెద్ద నగరాలలో రియల్ ఎస్టేట్ రంగం వెనకడుగున ఉంది. ఈ తరుణంలో కేవలం హైదరాబాద్ మాత్రమే ప్రగతి బాటలో పయనిస్తున్నది. అనరాక్ (ANAROCK) రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ పరిశోదన నివేదిక ప్రకారం భారత దేశంలోని ఏడు అతి పెద్ద నగరాలలో హైదరాబాద్ మాత్రమే 2013-14 నుండి 2017 వరకు 34% వృద్ధి సాధించింది.

గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ పెట్టుబడిదారులు భారతదేశంలోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో, దేశంలో రియల్ ఎస్టేట్ లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో నిర్మాణాత్మక పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.

హైదరాబాద్ కు  చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ  ఇంకర్ (INCOR) కొంపల్లిలో నిర్మించే రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో  100 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.687 కోట్లు) బ్రూక్ ఫీల్డ్ యొక్క 4.5 బిలియన్ డాలర్ల గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ నుండి పెట్టుబడి పెట్టబడింది. ఈ ప్రాజెక్టు 12 ఎకరాలలో 1100 అపార్ట్ మెంట్ లు 60 లక్షల చదరపు అడుగులతో నిర్మాణం చేయబోతున్నారు.

3,586 total views, no views today