హైటెక్ సిటి ఇనార్బిట్ మాల్ , జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ సులభతరం చేసే ఉద్దేశ్యంతో దుర్గంచెరువు పై నిర్మించే కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభ దశలో ఉన్నది. మార్చి 2019 వరకు కేబుల్ బ్రిడ్జ్ పూర్తి కానున్నది. ప్రస్తుతం ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ నర్మద నదిపై బరుచ్ జిల్లా గుజరాత్ లో 1.4 కి.మీ పొడవున నిర్మించారు.
హైదరాబాద్ దుర్గంచెరువు పై 754.38 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 184 కోట్లు ఖర్చు చేయనున్నారు. 13 ఫౌండేషనులు వేస్తె , 12 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జ్ పూర్తయితే మాధాపూర్,జూబ్లీహిల్స్ ల మధ్య ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండ సందర్శకులకు విందు చేయనుంది.
దీనికి ఉపయోగించే కేబుల్స్ ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుండి తెప్పించారు. దీనికి సంబందించిన ప్రీ కాస్ట్ వర్క్ అంతా కొందాపూర్ లో నడుస్తుంది.
నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను వీడియో లో చూడవచ్చు.
9,563 total views, 3 views today