హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో బ్రూక్ ఫీల్డ్ 100 మిలియన్ డాలర్ల నిర్మాణాత్మక పెట్టుబడి

HyderabadUpdates.in,Hyderabad Updates, Apartments, gated communitiesకెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ అస్సేట్ మేనేజ్మెంట్ కంపెని 100 మిలియన్ డాలర్లను  ఇంకర్ అనే హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టింది.

దేశంలో  పెద్ద పెద్ద నగరాలలో రియల్ ఎస్టేట్ రంగం వెనకడుగున ఉంది. ఈ తరుణంలో కేవలం హైదరాబాద్ మాత్రమే ప్రగతి బాటలో పయనిస్తున్నది. అనరాక్ (ANAROCK) రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ పరిశోదన నివేదిక ప్రకారం భారత దేశంలోని ఏడు అతి పెద్ద నగరాలలో హైదరాబాద్ మాత్రమే 2013-14 నుండి 2017 వరకు 34% వృద్ధి సాధించింది.

గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ పెట్టుబడిదారులు భారతదేశంలోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో, దేశంలో రియల్ ఎస్టేట్ లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో నిర్మాణాత్మక పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.

హైదరాబాద్ కు  చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ  ఇంకర్ (INCOR) కొంపల్లిలో నిర్మించే రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో  100 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.687 కోట్లు) బ్రూక్ ఫీల్డ్ యొక్క 4.5 బిలియన్ డాలర్ల గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ నుండి పెట్టుబడి పెట్టబడింది. ఈ ప్రాజెక్టు 12 ఎకరాలలో 1100 అపార్ట్ మెంట్ లు 60 లక్షల చదరపు అడుగులతో నిర్మాణం చేయబోతున్నారు.

3,586 total views, no views today

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అడ్డా గా మారింది

తెలంగాణ రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ కు సాక్ష్యంగా నిలిచింది.దేశంలోని మిగత నగరాలలో రియల్ ఎస్టేట్ వెనకడుగులో ఉన్నప్పుడు మంచి రాబడులను ఇచ్చిన ఏకైక నగరం హైదరాబాద్.

అనరాక్ కన్సల్టెన్సీ వారి పరిశోదన ప్రకారం, భారత దేశంలోని ఏడు అతి పెద్ద నగరాలలో హైదరాబాద్ మాత్రమే 2013-14 నుండి 2017 వరకు 34% వృద్ధి సాధించింది. ధిల్లీ, ముంబై, పూణే, చెన్నై, కోల్ కతా లలో అమ్మకాలు పడిపోయాయి.  ధిల్లీ NCR లో అత్యధికంగా 67% తగ్గాయి. బెంగళూరులో 21% తగ్గాయి.

Image Source: Economic Times.

8,415 total views, no views today

యాదగిరిగుట్ట వైటిడిఏ మాస్టర్ ప్లాన్ లో విశేషాలు

యాదగిరిగుట్టను అన్ని సౌకర్యాలతో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో  సిఎం కేసిఆర్ గుట్ట అభివృద్ధి పనులను యజ్ఞం లా చేయిస్తున్నారు.     యాదగిరిగుట్టను గొప్ప  ఆద్యాత్మిక యాత్ర స్థలంగా అభివృద్ధి చేయడానికి   యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ను   (వైటిడిఏ -యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సాధికార సంస్థ) ఏర్పాటు చేసారు. వైటిడిఏ పరిధి లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎలా అభివృద్ధి చేయాలో తెలియజేసే వైటిడిఏ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.

యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి, సైదాపూర్, మల్లాపూర్, దాతార్ పల్లి, బస్వాపూర్  అనే ఏడు గ్రామాలతో 104.58 చ.కి.మీ ల పరిధి తో వైటిడిఏ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పున ఆలేరు, పశ్చిమాన తుర్కపల్లి, ఉత్తరాన రాజాపేట, దక్షిణాన భువనగిరి మండలాలున్నాయి .

యాదగిరిగుట్ట దేవాలయ  అభివృద్ధి కోసం 1391. 09 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఆ భూమిని కింది తెలిపిన విధంగా కేటాయించారు .

1.  టెంపుల్ సిటి ఫేజ్ – II                 – 614.11 ఎకరాలు
2. టెంపుల్ సిటి ఫేజ్ – I     – 234.02 ఎకరాలు
3. అటవీ ప్రాంతం                                       – 87.06 ఎకరాలు
4. కొత్తగా భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతం – 132.09 ఎకరాలు
5. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్                   – 106.31 ఎకరాలు
6. కొత్తగా భూ సేకరణ ప్రతిపాదిత ప్రాంతం   – 6.24 ఎకరాలు
7.  గండి చెరువు                          – 34.07 ఎకరాలు
8. కొండ ప్రాంతం                       – 11.04 ఎకరాలు
9. స్వామీ వారి ఉద్యానవనం    – 25 ఎకరాలు
10. కళ్యాణమండపం                 -25.36 ఎకరాలు                                                                     11. వివిఐపి కాటేజీలు                – 13.26 ఎకరాలు                                                                     12. ఖాళి స్థలం                           – 20.11 ఎకరాలు
13.  అర్చకుల & దేవాలయ ఉద్యోగుల గృహ సముదాయం  – 9.22 ఎకరాలు                       14. 200 రూములు &  డార్మిటరి – 15.15 ఎకరాలు                                                                 15. 7000 కార్ పార్కింగ్               – 37.38 ఎకరాలు
16. బస్ టర్మినల్ & షాపింగ్      – 14.27 ఎకరాలు
17. ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్               – 1 ఎకర

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా

భవిష్యత్తులో పెరగబోయ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు , సమీప రైల్వే రైల్వే స్టేషన్ ఆధునీకరణ, మెట్రో రైలు సౌకర్యం, పాదచారులకు నడకదారులు, సైకిల్ లాంటి  మోటారు యేతర వాహనాలకు ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటుకు  ప్రణాలికలు  వైటిడిఏ మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు.

రద్దీని ఎదుర్కొనే విశాలమైన రోడ్లు,రింగ్ రోడ్లు

యాదగిరిగుట్టను కలిపే  రాయగిరి రోడ్డు , కీసర రోడ్డు, రాజాపేట రోడ్డు,వంగపల్లి రోడ్లను  వెడల్పు పెంచి 4 ట్రాకులతో 150 అడుగుల రోడ్లు వేస్తారు.ఈ 4 రోడ్లను కలుపుతూ 150 అడుగుల రింగు రోడ్డును వేస్తారు.     

 

 

 

 

 

 

 

 

 

 

టూరిజం కాన్సెప్ట్ తో  కారిడార్లు 

యాదగిరిగుట్టలో పంచ నరసింహ స్వామీ, పంచ భూతాలూ జత చేసి ఐదు కారిడార్లు ఏర్పాటు చేసి ఒక్కో కారిడార్ కు పంచ భూతాలలో ఒక పేరు పెట్టి, ప్రతీ కారిడార్ ప్రవేశంలో మహా ద్వారాన్ని నిర్మిస్తారు.

పంచ నరసింహ స్వామి కేత్రం           పంచ భూతాలు
యోగనంద నరసింహ అవతారం            గాలి
లక్ష్మీ నరసింహ అవతారం                       నీరు
ఉగ్ర నరసింహ అవతార్                            ఆకాశం
గండబేరుండ నరసింహ అవతారం        అగ్ని
జ్వాలా నరసింహ అవతారం                     భూమి

ఐదు కారిడార్ల అభివృద్ధి:
1. జాతీయ రహదారి 169 నుండి దేవస్థానం                                                                               2. తుర్కపల్లి నుండి దేవస్థానం                                                                                                       ౩.రాజాపేట నుండి దేవస్థానం
4. వంగపల్లి నుండి దేవస్థానం
5. పాతగుట్ట నుండి దేవస్థానం

ఎక్కువ రద్దీ ఉండే మొదటి రెండు కారిడార్లు అయిన జాతీయ రహదారి 169 నుండి దేవస్థానం వచ్చే కారిడార్, తుర్కపల్లి నుండి దేవస్థానం వచ్చే కారిడార్ లలో  పాదచారులకు నడకదారులు, సైకిల్ లాంటి  మోటారు యేతర వాహనాలకు ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటు చేస్తారు.

మరిన్ని విశేషాలు… త్వరలో……

12,871 total views, no views today

హైదరాబాద్ లో కొత్త ఐటీ క్లస్టర్లు

hyderabad updates, hyderabad it industry, it expansion, ktr meeting with officials
హైదరాబాద్ లో కొత్త ఐ టి క్లస్టర్ల ఏర్పాటు మౌలికసదుపాయాల కల్పన గురించి అధికారులతో మంత్రి కేటిఆర్ సమావేశం

* హైదరాబాద్ లో ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ

*నగరంలో నూతన ఐటీ క్లస్టర్లకు అనుగుణంగా వసతుల కల్పన

*స్వల్పకాలిక లక్ష్యాలతో కార్యాచరణ

*అవసరమైన  చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు

హైటెక్ సిటి, గచ్చిబౌలి లు  ఐటీ కంపనీలకు అడ్డలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపనీలను నగరం నలుదిశలా విస్తరించి కావలసిన మౌలిక సదుపాయాలు  కల్పిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయసగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న మంత్రి కేటీఆర్, త్వరలోనే ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, హెచ్‌ఎండీఏ తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. 

ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లివంటి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతోపాటుగా నూతనంగా ఏర్పాటుకానున్న మరో ఐటీ క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురుగునీటి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటిసరఫరా అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఐటీ రంగంలో ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి  . రానున్న ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకేవైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పెరుగుదలలో భాగంగా అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, అవకాశం ఉన్న చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటివి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

12,216 total views, no views today

యాదగిరిగుట్టలో జంట నగరాలు

యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారు.  యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ రూపు రేఖలు  సమూలంగా మార్చుతున్నారు. దేవాలయం చుట్టూ గిరిప్రదక్షిణకు అనువుగా రోడ్ల నిర్మాణం,  యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రోడ్లను 150 ఫీట్లతో 6 వరుసల రోడ్లుగా మార్చడం, ప్రధాన రోడ్లను కలిపే రింగు రోడ్డు, యాత్రికులకు కావలసిన వసతి సౌకర్యాల కల్పన, చెరువులను, అడవులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం వంటి అభివృద్ధి పనులతోపాటు యాదగిరిగుట్టను తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రంగా , యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి ఏకంగా  మాస్టర్ ప్లాన్ ను రూపొందించి , ప్రధాన నగరంగా   అభివృద్ధి చేస్తున్నారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,ఇదంతా గుట్టను అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రక్రియ అయితే దీనిని ఆధారంగా చేసుకొని మరో నగరం యాదగిరిగుట్టకు 6 కి మీ ల దూరంలో మాసాయిపేటలో  అన్ని హంగులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఈ నగరం కూడా ఏర్పాటైతే యాదగిరిగుట్ట జంట నగరాలుగా రూపుదిద్దుకుంటుంది. ఈ కొత్త నగరమే “సిద్ధ క్షేత్ర ధాం”.

Hyderabad Updates, Yadagirigutta Updates, Development Updates, Real estate updates

సిద్ధ క్షేత్ర ధాం ను శ్రీ అభ్యసేన్ సురేశ్వర్ జీ మహారాజ్ గారి ఆద్వర్యంలో  సహయోగ  ట్రస్ట్ వారు 1000 ఎకరాలలో నిర్మించడానికి ప్రణాలికలు రూపొందించారు. ఇందులో భాగంగా 125 ఎకరాలలో 3185 కోట్లతో మొదటి దశలో విద్యాలయాలు, కళాశాలలు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు, త్రీ డి ఐ మాక్స్ థియేటర్, క్రికెట్ స్టేడియం, ఇతర ఆట స్థలాలు,గోశాల మరియు నివాస గృహాలతో టౌన్షిప్ కూడా అభివృద్ధి చేయనున్నారు.

Hyderabad Updates, Yadagirigutta Updates, Yadagirigutta Developments

సిద్ధ క్షేత్ర ధాం వల్ల మాసాయిపేట శివారు లో ఉన్న వెంచర్లకు గిరాకి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ రియల్ ఎస్టేట్ ప్లాటింగ్  వెంచర్లు వెలిసాయి. భవిష్యత్తులో కాబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్నారు.

ప్రభుత్వ నిబందనల ప్రకారం ఇక్కడ డిటిసిపి అప్రూవల్ ఉన్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనాలి. డిటిసిపి అప్రూవల్ ఉన్నప్లాట్లు కొనడం వల్ల న్యాయ పరమైన మరియు సాంకేతిక పరమైన  సమస్యలు ఉండవు.

8,352 total views, no views today

హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు

Hyderabad Updates, CM, KCR, UAE Minster, IT Minister, KTR
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం

హైదరాబాద్ నగరంలో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నది .

గురువారం ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో  హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, యుఎఇల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి, యుఎఇ మంత్రికి చెప్పారు. దీనికి యుఎఇ  విదేశీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ కాన్సులేట్ ఏర్పాటుకు అంగీకరించినట్టు అధికారులకు సూచనలు ఇచ్చారు.

వివిధ దేశాల నుంచి ప్రజలు వైద్య చికిత్స కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ వైద్య పర్యటనకు  గమ్యస్థానంగా ఉందని యుఎఇ మంత్రికి కేసీఆర్ వివరించారు.
తెలంగాణాలో ‘వ్యాపారం చేయడం సులభం’ గురించి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  వివరించారు. “దేశం యొక్క తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది” అని ఆయనకు తెలిపాడు.

7,499 total views, no views today

హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి క్లస్టర్

hyderabad updates, hitec city hyderabad, rajendranagar, serilingampalli
హైటెక్ సిటి హైదరాబాద్ (పాత చిత్రం)

ఐ టి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రాజేంద్రనగర్ వద్ద మరో ఐ టి హబ్ ను ప్రారంభించాలని ఐటి మంత్రి నిర్ణయించారు. ఒక సమావేశంలో కేటీఆర్  మాట్లాడుతూ  మాధాపూర్, కొండాపూర్, గోపన్నపల్లి లతో  శేరిలింగంపల్లి ఐ టి హబ్ లాగ రాజేంద్రనగర్ కూడా రాబోయే రోజుల్లో ఐ టి కంపనీలతో కళకళ లాడుతుంది అన్నారు.

బుద్వేలు, కిస్మత్ పూర్ మధ్యలో 350 ఎకరాల భూమిని ఐ టి క్లస్టర్ కోసం గుర్తించామని తెలిపారు.  ఇటీవల 28  ఐ టి కంపనీల అధికారులు ఐ టి క్లస్టర్ కోసం కేటాయించిన స్థలాన్నీ సందర్శించి కంపనీలను ఏర్పాటుచేయడానికి అంగీకారం తెలిపారు. ఈ  ఐటి కంపనీల ద్వార 1.2 లక్షల మందికి ఉపాది కలుగుతుందని, దీనిని నేనే స్వయంగా సమీక్షిస్తూ రాజేంద్రనగర్ ను అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి స్పష్టం చేశారు.

శంషాబాద్, బెంగలూరుల మధ్య వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

వికారాబాద్ నుండి 42 కి మీ మేర మూసి సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల ఖర్చుతో ఆగస్ట్ లో పని ప్రారంభిస్తామని చెప్పారు. మరో 100 కోట్లతో గండిపేట సుందరీకరణ చేసి సిటి నుండి కుటుంబంతో సహా వచ్చి గడిపే విదంగా మాల్స్ , సినిమా హల్లకు అనుమతినిచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటిఆర్  చెప్పారు.

8,431 total views, no views today

హైదరాబాద్ దుర్గంచెరువు పై కేబుల్ బ్రిడ్జ్

హైటెక్ సిటి ఇనార్బిట్ మాల్ , జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ సులభతరం చేసే ఉద్దేశ్యంతో  దుర్గంచెరువు పై నిర్మించే కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభ దశలో ఉన్నది.  మార్చి 2019 వరకు కేబుల్ బ్రిడ్జ్  పూర్తి కానున్నది. ప్రస్తుతం ఇలాంటి  కేబుల్ బ్రిడ్జ్ నర్మద నదిపై బరుచ్ జిల్లా గుజరాత్ లో 1.4 కి.మీ పొడవున నిర్మించారు.

baruch cable bridge, hyderabad updates
నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్ దుర్గంచెరువు పై 754.38 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 184 కోట్లు ఖర్చు చేయనున్నారు. 13 ఫౌండేషనులు వేస్తె , 12 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జ్  పూర్తయితే  మాధాపూర్,జూబ్లీహిల్స్ ల మధ్య ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండ సందర్శకులకు విందు చేయనుంది.

దీనికి ఉపయోగించే కేబుల్స్ ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుండి తెప్పించారు. దీనికి సంబందించిన ప్రీ కాస్ట్ వర్క్ అంతా కొందాపూర్ లో నడుస్తుంది.

నర్మద నదిపై గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను వీడియో లో చూడవచ్చు.

9,316 total views, no views today

కొత్వాల్ గూడలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్

  • 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్
  • బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్ ల ఏర్పాటు
సింగపూర్ లోని నైట్ సఫారీ పార్క్

నగరానికి దూరంగా ఎక్కడో అడవిలో  ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా ?  చీకట్లో సైతం ఎటువంటి అపాయం లేకుండా వన్య ప్రాణుల  మధ్య సంచరించాలనుకుంటున్నారా  ?  అయితే మీ కోరిక హైదరాబాద్ లోనే  నెరవేరబోతుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో  కొత్వాల్ గూడలో 125 ఎకరాలలో సింగపూర్ తరహ నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి హెచ్ ఎం డి ఏ సన్నాహాలు చేస్తుంది.

హైదరాబాద్ లో

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కొత్వాల్ గూడను నైట్ సఫారి పార్క్ ఏర్పాటు చేయడానికి తగిన స్థలంగా  గుర్తించారు. 80 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇంకా 45 ఎకరాల స్థలం సేకరించవలసి ఉంది. ఈ నైట్ సఫారి పార్క్ కొత్త  అనుభూతులను  అందిస్తుంది అనడం లో  ఎలాంటి సందేహం లేదు. ఇది భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తుందని హెచ్ఎండిఏ కమీషనర్ చిరంజీవులు అన్నారు.

సింగపూర్ లో నైట్ సఫారి పార్క్ ఎలా ఉంటుందో కింది విడియోలో చూడవచ్చు

 

7,579 total views, no views today